Tummala Nageswara Rao : బీఆర్ఎస్ కంటే.. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వెయ్యి పాళ్లు నయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వేయి పాల్లు నయమని, ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం అని గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసాం. ఐకేపీ సెంటర్ల పెంపు గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామన్నారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవు.. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ.. ఈ దఫా మిల్లర్ల దోపిడీ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో కోతలకు మిల్లర్ల స్వస్తి..దీంతో ప్రతి కింటా పై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామన్నారు. రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు.. గతంలో 45 రోజులు పెట్టేది. రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడు. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుంది దీంతో రైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవు. వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవంతో ఇప్పుడు రైతు బతుకుతున్నాడని, కేసీఆర్ ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన లేదు. ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేది. అయినప్పటికీ కాంగ్రెస్, రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తోంది. అంతే గాక, ఇక ముందు ఏ ఒక్క రైతు కూడా ఇలా నష్టపోకుండా, ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించి పంట భీమా పథకాన్ని ౩,౦౦౦ కోట్ల రూపాయలు వెచ్చించి వానాకాలం నుండి అమలు చేస్తున్నామన్నారు.
అంతేకాకుండా..’తడిచిన ధాన్యాన్ని సైతం ఈ ప్రభుత్వం సేకరిస్తుంది. గతంలో కల్లాల్లో వరికుప్పలమీద రైతులు గుండె పగిలి చనిపోయారు. కానీ మాది రైతు ప్రభుత్వం అని తెలిసి రైతులు గుండె ధైర్యంతో బతుకుతున్నారు. తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు 500 బోనస్. తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో సన్న బియ్యం పేరుతోటి దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారు. అలా కాకుండా పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి సన్నబియాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మనం దొడ్డు వడ్లు అమ్ముకొనుడెంది, సన్న వడ్లు కొనుక్కునుడేంది.. మనమే మనకు అవసరమైనంత సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టాము. నాట్లేసుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీమును ప్రవేశపెట్టాము.
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీములు వర్తింప చేస్తాము. దొడ్డు వడ్లకు 500 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేకపోయినా…మూడు నుంచి ఐదు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తూ, మిల్లర్ల ధాన్యం కోతను అరికడుతూ.. ప్రత్యక్షంగా అంతమేరా రైతుకు ఈ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. అది తెలుసు కనుకనే తెలంగాణ రైతులు నిశ్చింతగా ఉన్నారు. రైతులను కాల్చుకుతిన్న టిఆర్ఎస్ అగ్ర నాయకులు ఇప్పుడు రైతుల పేర నాటకాలు ఆడుతున్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని 2020లో కెసిఆర్ ప్రకటించారు. ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్న నయా పైసా బోనస్ ఇయ్యలేదు అందుకే కేసిఆర్ ను ఓడగొట్టి రైతులు ఇంట్లో కూర్చోబెట్టారు. అన్నదాతలార ఆలోచించండి..ఇది ప్రజా ప్రభుత్వం. ఎక్కడ దుబార చేయకుండా.. కెసిఆర్ అస్తవ్యస్థం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. త్వరలో అన్ని హామీలను నిలబెట్టుకుంటాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీల అమలు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పాము. ప్రారంభించి చూపించాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతాం. లేకుంటే ఓట్లే అడగం, ఇప్పటికైనా BRS నాయకులు తమ తప్పుడు ప్రకటనలు ఆపుకోవాలని హితవు పలికారు.’ అని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!