Women’s Asia Cup 2026: శ్రీచరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
- షెఫాలీ, స్మృతి బ్యాటింగ్ జోరు
- శ్రీలంకపై భారత్ అద్భుత విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India 8th Asia Cup title: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తుది పోరులో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో 8వసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
భారత బ్యాటర్ల దూకుడు.. 183 పరుగుల స్కోరు
టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభం అందించారు. స్మృతి మంధాన 59 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 68 పరుగులతో అదరగొట్టింది. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేసింది. మిడిలార్డర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ 14 పరుగులు, రిచా ఘోష్ 17 పరుగులు చేశారు. దీప్తి శర్మ 5 పరుగులు చేయగా, గునాలన్ కమలిని 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత మహిళల జట్టు నిర్ణీత ఇన్నింగ్స్‌లో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మిథిలి అయోధ్య, చమరి అథపత్తు, చముది ప్రబోధ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Also Read
- IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
- Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
- Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
- Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
శ్రీలంక బ్యాటింగ్ కుప్పకూలింది
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ ఇమేషా దులాని 4 పరుగులకే పరిమితం కాగా, కెప్టెన్ చమరి అథపత్తు 36 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. విష్మి గుణరత్నే 20 పరుగులు చేయగా, హర్షిత సమరవిక్రమ 9 పరుగులు చేసింది. నిలాక్షిక సిల్వా 22 పరుగులు సాధించినప్పటికీ, మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. కవిషా దిల్హారి 7, హసిని పెరీరా 1, కౌషిని నుత్యంగన 9 పరుగులు చేశారు. శ్రీలంక మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. చివరికి శ్రీలంక మహిళల జట్టు 111 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
శ్రీచరణి అద్భుత బౌలింగ్.. 4 వికెట్లు
భారత విజయంలో బౌలర్ల పాత్ర కీలకంగా నిలిచింది. ముఖ్యంగా శ్రీచరణి అద్భుత ప్రదర్శనతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. ఆమె నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ కూడా బంతితో సత్తా చాటి మూడు వికెట్లు తీసుకుంది. క్రాంతి గౌడ్, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్ తలో వికెట్ సాధించారు. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో శ్రీలంక జట్టు 111 పరుగులకే పరిమితమైంది.
రికార్డు 8వ ఆసియా కప్ టైటిల్
శ్రీలంకపై 72 పరుగుల విజయంతో భారత మహిళల జట్టు మరోసారి ఆసియా క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో 8వసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. భారత బ్యాటర్ల దూకుడు, బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మహిళల క్రికెట్లో భారత్ తన స్థాయిని మరోసారి నిరూపించుకుంది.
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త