Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abir Singh Debut: బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఓ ప్రముఖ స్టార్ హీరో కుమారుడు కాదు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన బాడీగార్డ్ శేరా కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త హాల్చల్ చేస్తోంది. శేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. ఎన్నో ఏళ్లుగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అబీర్ సింగ్ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి.
అందుతున్న సమాచారం ప్రకారం అబీర్ సింగ్ ‘టార్జాన్’ (Tarzan)’ అనే సినిమాతో హీరోగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాలో సూరజ్ పంచోలి కూడా కీలక పాత్రలో కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి తారాగణం, దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. సల్మాన్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారా లేదా ఆయనకు ఇందులో ఏదైనా పాత్ర ఉందా అనే విషయంలో కూడా స్పష్టత లేదు.
Also Read
అబీర్ సినిమా ఎంట్రీ గురించి ఇప్పుడు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2022లోనే సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ శేరా కుమారుడిని హీరోగా పరిచయం చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ ప్రాజెక్టుకు దివంగత నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని, 2023 జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆఫీషియల్ ప్రకటన రాలేదు. 2023 మార్చిలో సతీష్ కౌశిక్ మరణించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇప్పుడు ‘టార్జన్’ పేరుతో అబీర్ డెబ్యూ వార్తలు రావడంతో పాత ప్రాజెక్ట్ మరో రూపంలో తెరపైకి వచ్చిందా అనే ఆసక్తి కూడా నెలకొంది.
ఇక సూరజ్ పంచోలి విషయానికి వస్తే.. ఆయనకు సల్మాన్ ఖాన్‌తో మంచి అనుబంధం ఉంది. 2015లో సల్మాన్ ఖాన్ నిర్మించిన ‘హీరో’ సినిమాతోనే సూరజ్ పంచోలి బాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమాలో అతనితో పాటు అథియా శెట్టి కూడా హీరోయిన్గా డెబ్యూ చేసింది. ఇప్పుడు ‘టార్జన్’లో అబీర్‌తో కలిసి సూరజ్ కనిపిస్తే, సల్మాన్‌తో అనుబంధం ఉన్న ఇద్దరు నటుల కెరీర్లు ఒకే ప్రాజెక్టుతో మళ్లీ వార్తల్లోకి వచ్చినట్టవుతుంది.
సల్మాన్ ఖాన్ గతంలో కూడా పలువురు కొత్త నటీనటులకు అవకాశాలు ఇచ్చారు. సోనాక్షి సిన్హా, జరీన్ ఖాన్, డైసీ షా, సాయి మంజ్రేకర్, ఆయుష్ శర్మ వంటి పలువురు నటీనటులు సల్మాన్‌తో అనుబంధం ఉన్న సినిమాల ద్వారా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో శేరా కుమారుడు అబీర్ విషయంలో కూడా సల్మాన్ మద్దతు గట్టిగానే ఉంటుందనే చర్చ మొదలైంది. ఇక శేరా కుమారుడు అబీర్ సింగ్ బాలీవుడ్ ఎంట్రీపై నిజంగానే కార్యరూపం దాల్చుతుందా? సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టుకు అండగా నిలుస్తారా? సూరజ్ పంచోలి పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోంది? అనే ప్రశ్నలకు ఆఫీషియల్ ప్రకటన వచ్చిన తర్వాతే సమాధానం దొరుకుతుంది.
- Tags
- cinema
- Salman Khan
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!