NTV Telugu Site icon

Tummala Nageswara Rao : బీజేపీ – బీఆర్‌ఎస్‌ పార్టీల్లో కుర్చీల కొట్లాట జరుగుతుంది

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలో కుర్చీల కొట్లాట జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. మీ కుర్చీల కోట్లలో మమ్ములను ఎందుకు లాగుతారన్నారు. బీజేపీలో ఈటలను అయినా ఇంకెవ్వరినైనా అధ్యక్షునిగా పెట్టుకోండి నాకెందుకని, నన్ను విమర్శ చేస్తే పడను.. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతా అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో నేను ఉన్నాను… మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు అనేది నాకు తెలుసు అని, మూసీ ప్రక్షాళన చేయడానికి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ పెట్టారు కదా? మూసీ ప్రక్షాళన చెయ్యకుండా…మూసి అభివృద్ధి ఎలా చేస్తా అనుకున్నారు? కూల్చి ఉంటే ఒకలా? కుర్చీ పోతే మరోలా మాటలు మారవద్దని ఆయన అన్నారు. మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ఇంకా DPR నేను చూడలేదని, దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అన్నారు.

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. మద్యం షాపులు మూత.. 10 రోజులు పస్తులేనా..?

అంతేకాకుండా.. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్ష నేతలు సహకరించకపోగా.. విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 42 లక్షల మందికి రుణమాఫీ చేశామని ఎప్పుడూ చెప్పలేదని, గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టినవి లెక్కలోకి తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు. పంటరుణాలు తీసుకున్న 42లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ఇచ్చారని, వారికి 31వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. రుణమాఫీ కాని వారి వివరాలు పంపాలని అడుగుతున్నామని, ఒకే నెలలో 22లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేశామని ఆయన వెల్లడించారు. రూ.2లక్షలకు పైగా రుణం ఉన్న వారికి రూ.2లక్షలు వేస్తామని చెప్పామని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నారన్నారు. రైతుల పట్ల ఆయా పార్టీల నేతలకు ఉన్న అక్కసు అర్థమవుతోందన్నారు. పదేళ్లు పాలించిన పార్టీ నేతలు కూడా రుణమాఫీని విమర్శిస్తున్నారు అని తుమ్మల మండిపడ్డారు.

Breaking: ఇక నుంచి హైదరాబాద్‌లో డీజే నిషేధం