Student Suicide: తాను ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు పెళ్లి నిశ్చయం కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చెన్నైలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. స్థానిక సర్ రామస్వామి ముదలియార్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ప్లస్ టూ చదువుతున్న సమయంలో విద్యార్థి(17) తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ నడుపుతున్న ట్యూషన్‌కు బాలుడు వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ సమయంలో ఆ ఉపాధ్యాయురాలు అతడితో ప్రేమిస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విద్యార్థితో మాట్లాడడం మానేసింది. ఆ తర్వాత ఆమె తనను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడు.
Physical Harassment: రైతు బజార్‌లో కామాంధుడు.. కూరగాయలు అమ్మే మహిళలే టార్గెట్..!
ఆగస్టు 30వ తేదీన స్నేహితులతో కలిసి చెన్నై రాజధాని కళాశాలలో కౌన్సెలింగ్‌కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. అనంతరం గదిలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విద్యార్థి మృతి కేసులో ఉపాధ్యాయురాలిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.