TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జూలై కోటాకు సంబంధింది పలు సేవల టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. నేటి తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడీప్ ఆధారంగా టికెట్లను కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి టికెట్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేడు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.
ఇక కల్యోణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా అదే రోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయనుంది.
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
అలాగే ఏప్రిల్ 23న శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.. వీటితో పాటు జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు గదులో కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!