Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala

Tirumala

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌. జూలై కోటాకు సంబంధింది పలు సేవల టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. నేటి తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడీప్‌ ఆధారంగా టికెట్లను కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి టికెట్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేడు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.

ఇక కల్యోణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా అదే రోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయనుంది.

అలాగే ఏప్రిల్ 23న శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.. వీటితో పాటు జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు గదులో కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ కోటాను మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Exit mobile version