Indrakeeladri Temple: బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri Temple: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు , గాదిరాజు వెంకట సుబ్బరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో , పాలకమండలి ఛైర్మన్ , అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అమ్మవారి ఆశీస్సులు భక్తులందరి పైనా ఉండాలని టీటీడీ బోర్డు సభ్యులు మేకా శేషు బాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజులు అన్నారు. భక్తి భావం, సేవా భావం ఎక్కడ ఉంటాయో అక్కడే భగవంతుడు ఉంటాడని వారు పేర్కొన్నారు. భక్తి భావంతో ప్రతి ఒక్కరూ ఉండాలని వారు తెలిపారు. దసరాకు ఎక్కడ అసౌకర్యం లేకుండా వసతులు కల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా అభినందనీయమని ప్రశంసించారు. అమ్మవారిని అందరికీ చేరువ చేసేలా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
- CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
- YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
Also Read: Most Expensive Pen : ఈ పెన్ను ఎన్ని కోట్లో తెలుసా.. ప్రత్యేకతలు ఏంటంటే?
టీటీడీ నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని దుర్గ గుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో శ్రీవారి సోదరి అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఆయన చెప్పారు. అలానే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కూడా ఇంద్రకీలాద్రి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేలా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!