NTV Telugu Site icon

TTD: పాప వినాశనం డ్యాంలో బోటింగ్.. అటవీశాఖ యూ టర్న్..

Ttd

Ttd

భక్తుల దాహార్తిని తీర్చే తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో ఐదుగురు వ్యక్తులు మంగళవారం కయాక్‌ బోట్లలో తిరిగారు. తిరుమలలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌ ఏర్పాటు చేసేందుకు సర్వే జరిగినట్టు కొందరు ఫారెస్ట్‌ సిబ్బంది తెలిపారు. ఈ అంశంపై తాజాగా టీటీడీ స్పందించింది. దీంతో తిరుమల పాప వినాశనం డ్యాంలో బోటింగ్‌పై అటవీశాఖ యూటర్న్ తీసుకుంది. అటవీశాఖ అధికారులు టీటీడీకి కనీస సమాచారం అందించకుండా డ్యాంలో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో బోటింగ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు.

READ MORE: Crime: ప్రేమ వ్యవహారం? తండ్రి, కూతురిని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు..

తిరుమలను పర్యాటక క్షేత్రంగా భావించవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది టీటీడీ.. బోటింగ్ విషయం బూమ్ రాంగ్ కావడంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం అందింది. అందుకే డ్యాంలో బోట్లతో తనిఖీ నిర్వహించామని అటవీశాఖ సమాధానమిచ్చింది. అటవీశాఖ వివరణ చూసి శ్రీవారి భక్తులు నవ్వుకుంటున్నారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నాయంటే.. అది టీటీడీ విజిలెన్స్, పోలీసుల వైఫల్యంగా భావించాలా? అని ప్రశ్నిస్తున్నారు.

READ MORE: Minister Komatireddy: ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు సలహాలిచ్చిన స్వీకరిస్తాం..