అటవీశాఖ అధికారులు చేసిన పని టీటీడీకి తలనొప్పిగా మారింది. పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో అటవీశాఖ అధికారులు పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ కి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణులను రప్పించారు.
భక్తుల దాహార్తిని తీర్చే తిరుమలలోని పాపవినాశనం డ్యాంలో ఐదుగురు వ్యక్తులు మంగళవారం కయాక్ బోట్లలో తిరిగారు. తిరుమలలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పాపవినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాటు చేసేందుకు సర్వే జరిగినట్టు కొందరు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. ఈ అంశంపై తాజాగా టీటీడీ స్పందించింది. దీంతో తిరుమల పాప వినాశనం డ్యాంలో బోటింగ్‌పై అటవీశాఖ యూటర్న్ తీసుకుంది. అటవీశాఖ అధికారులు టీటీడీకి కనీస సమాచారం అందించకుండా డ్యాంలో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో బోటింగ్ కోసం ట్రయల్…