TTD: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదలవుతాయి. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయి.
READ MORE: Medchal: గోరక్షక్‌దళ్ సభ్యుడిపై ముస్లిం యువకుడి కాల్పులు.. గోవుల తరలింపు సమాచారం ఇస్తానని పిలిచి..
కాగా ప్రస్తుతం.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,853 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 3.47 కోట్లు.
READ MORE: Astrology: అక్టోబర్ 23, గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..