Site icon NTV Telugu

TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం

Ttd Eo Dharma Reddy

Ttd Eo Dharma Reddy

TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉండాలన్న ఉద్దేశంతోనే టీటీడీ ద్వారా తిరుపతిని కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Read Also: Tirumala: నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుపతి అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి, దేశ నలుమూలల నుంచి తిరుమలకు తిరుపతి మీదుగా వెళ్తారన్నారు. ఈ కారణంగానే తిరుపతిలో మంచి వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అందుకోసమే టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, పాలక మండలి సహా మేమంతా కృషి చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version