NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఆన్‌లైన్‌లో నవంబర్‌ టికెట్ల షెడ్యూల్ విడుదల

Tirumala

Tirumala

Tirumala: టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆన్‌లైన్‌లో నవంబర్‌ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. మరోవైపు లక్కిడిప్ విధానంలో పొందే ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇవాళ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

Read Also: Gold Today Price: బంగారం ప్రియులకు ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

రేపు ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.

Read Also: FIFA Womens World Cup: ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్

24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా విడుదల చేయనుంది. టీటీడీ వెబ్ సైట్ www.tirupatibalaji.ap.gov.in ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.