తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠం ద్వార దర్శనం చేయించింది. గాయపడిన భక్తులందరినీ టీటీడీ ప్రత్యేకంగా తిరుమలకు రప్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.
READ MORE: Formula E Race Case : ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన బీఎల్‌ఎన్ రెడ్డి
ఇదిలా ఉండగా.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించాలని విన్నవించారు. తిరుపతిలో పవన్ మీడియాతో మాట్లాడారు. ఇంత మంది అధికారులున్నా.. ఆరుగురి ప్రాణాలు పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు.. భక్తులను కంట్రోల్ చేయలేరా? అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారంటూ ఫైరయ్యారు.
READ MORE: RK Roja : భక్తల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు?.. కూటమిపై రోజా ఫైర్