తిరుమలలో భద్రతా వైఫల్యం బయటపడడంతో టీటీడీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆనంద నిలయంలో నిబంధనలకు విరుద్దంగా చిత్రీకరించిన వ్యక్తిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. భక్తుడు ఉధ్దేశపూర్వకంగానే ఆలయంలోకి మొభైట్ ఫోన్ తీసుకువెళ్ళినట్లుగా సిసి పుటేజి ద్వారా గుర్తించాం అన్నారు. భధ్రతాసిబ్బంది వైఫల్యం కారణంగానే ఘటన జరిగిందని భావిస్తున్నాం అన్నారు ధర్మారెడ్డి. విచారణ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని ఈవో తెలిపారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తాం అని స్పష్టం చేశారు.
శ్రీవారి ఆనంద నిలయాన్ని రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరీంనగర్ కి చెందిన రాహుల్ రెడ్డి అనే వ్యక్తి మొబైల్ ఫోన్ తో ఆనంద నిలయ గోపురాన్ని చిత్రికరించినట్లు గుర్తించారు పోలీసులు. మొబైల్ ఫోన్ ని ఆలయంలోకి ఉద్దేశపూర్వకంగా రాహుల్ రెడ్డి తీసుకువెళ్ళినట్లు సిసి ఫుటేజి ద్వారా గుర్తించారు పోలీసులు.. నిందితుడి విజువల్స్ ని ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసాడా ….లేక యాదృచ్చికంగా జరిగిందా అన్న దిశగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
Read Also: Kondagattu: కొండగట్టులో అంజన్న ఉత్సవాలు.. భద్రాద్రి నుంచి పట్టువస్త్రాలు
మరోవైపు మే 14 నుంచి 18వ తేదీ వరకు హనుమజ్జయంతి సందర్భంగా ఆకాశగంగ,జపాలి,బేడి ఆంజనేయస్వామి ఆలయం,ఏడవ మైలు ఆంజనేయస్వామి,నాదనీరాజనం వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు ఈవో ధర్మారెడ్డి. తిరుమలకు భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలో శ్రీవారిని దర్శించుకున్న 20.95 లక్షల మంది భక్తులు.. ఏప్రిల్ లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 114.12 కోట్లు.. 1.1.01 కోటి లడ్డూల విక్రయం.. 42.64 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ..తలనీలాలు సమర్పించిన భక్తులు 9.03 లక్షల మంది అని టీటీడీ వెల్లడించింది. రేపు రెండు ఘాట్ రోడ్డులతో పాటు రెండు నడకమార్గాలలో స్వచ్చ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అని టీటీడీ కార్యక్రమాల గురించి వివరించారు ఈవో ధర్మారెడ్డి.
ఆన్ లైన్ లో దర్శన,వసతి గదులు కోటా విడుదలకు సంబంధించిన క్యాలండర్ విడుదల చేసింది టీటీడీ..ప్రతి నెల 18వ తేది నుంచి 20వరకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేస్తారు…21వ తేదీన నేరుగా వర్చువల్ సేవా టిక్కెట్లతో పాటు నేరుగా బుక్ చేసుకునే సేవా టిక్కెట్లు విడుదల అవుతాయి. 23వ తేదీన శ్రీవాణి, అంగప్రదక్షణం, వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల..24వ తేదీన రూ.300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల..25వ తేదీన వసతి గదులు కోటా విడుదల అవుతాయి.
Read Also: Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్.. 5 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య