TTD : తిరుపతిలో ఇక రూమ్‌కోసం టెన్షన్ లేదు..
- తిరుమల గదుల కోసం ఇక ఇబ్బందులు అవసరం లేదు
- CRO కార్యాలయంలో ఒరిజినల్ ఐడీతోనే రిజిస్ట్రేషన్
- 'తొలుత వచ్చిన వారికి ప్రాధాన్యం' సూత్రం ప్రకారం గది కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు బస చేయడానికి గదులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం ఒక ముఖ్యమైన సూచన చేసింది. గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇకపై తిరుమలలో గదుల కోసం వెతుకులాట ఆపండి.. తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO)కు నేరుగా వెళ్లండి. అక్కడ మీ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ID card) చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు గది కేటాయింపు వివరాలతో ఒక SMS వస్తుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, “తొలుత వచ్చిన వారికి ప్రాధాన్యం” అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అంటే, ముందుగా CRO కార్యాలయానికి చేరుకున్న భక్తులకు గదులు కేటాయించబడతాయి. ఈ కార్యాలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. కాబట్టి, తదుపరిసారి మీరు తిరుమల వెళ్లినప్పుడు, గదుల కోసం ఇబ్బంది పడకుండా నేరుగా CRO కార్యాలయానికి వెళ్లి, మీ బసను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. TTD అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి…
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
OTT : ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అసభ్యకర కంటెంట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!