Tirumala Prank Video: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనే ఆకతాయిలు హల్‌చల్ చేశారు.. నారాయణగిరి ఉద్యాణవనంలోని క్యూలైన్ కాంప్లెక్స్‌ల్లో ప్రాంక్ వీడియోలు తీసి.. భక్తులను గందరగోళానికి గురిచేశారు.. క్యూలైన్లలో ప్రాంక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు తమిళ యువకులు.. కంపార్టుమెంట్ గేట్లు తెరుస్తున్నట్లు చేసి.. భక్తులతో పరిహాసాలు ఆడారు.. అయితే, ప్రాంక్ వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీ.. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్చగా పేర్కొన్న టీటీడీ.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్యగా పేర్కొన్న టీటీడీ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.
Read Also: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
కాగా, నారాయణగిరి షెడ్స్ లోని క్యూకాంపెక్స్‌లో వెళ్తూ.. మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోని తీశారు.. అయితే, ఆ కంపార్ట్‌మెంట్‌లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టాడు.. ఇక, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. కానీ, ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మారిపోయింది.. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.