TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

  • శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..
  • పండుగల వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం..
  • రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొన్న టీటీడీ అధికారులు..
Ttd

Ttd

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో త్వరలో జరగనున్న విశేష ఉత్సవాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దర్శన వేళల్లో కీలక మార్పులు చేపట్టింది. ఈ నెలలో రానున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ మరియు ‘శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది’ పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..

టీటీడీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం.. ఈ నెల 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 19వ తేదీన ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ రెండు ప్రధాన రోజుల్లో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. దీని ప్రభావం ముందు రోజు నుంచే ఉండనుంది. ముఖ్యంగా ఈ నెల 16, 18వ తేదీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే రికమండేషన్ లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేశారు.

Also Read:Sajjala Ramakrishna Reddy: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండండి.. ఓట్లు తొలగించకుండా జాగ్రత్త..!

బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. అధికారిక హోదాలో వచ్చే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ తెలిపింది. కేవలం సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను మాత్రమే రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. సంప్రదాయం ప్రకారం ఉగాది వంటి పెద్ద పండుగలకు ముందు ఆలయ శుద్ధి కార్యక్రమం (తిరుమంజనం) నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 17న ఉదయం ఆలయ ప్రాంగణాన్ని పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్‌ను తాత్కాలికంగా తెరతో కప్పి ఉంచుతారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Also Read:CM Revanth Reddy: ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.