Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. షెడ్యూల్ ఇదే..!

Tirumala

Tirumala

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో పాటు నెల మొత్తంగా నిర్వహించబోయే విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీన- మధ్యాష్టమిని నిర్వహించనున్నారు. 10వ తేదీన మతత్రయ ఏకాదశి, 13న మాస శివరాత్రి పండగలను వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Read Also: LEO : అడ్వాన్స్ బుకింగ్స్ లో లియో జోరు మాములుగా లేదుగా..

ఇక, 14 వ తేదీన మహాలయ అమావాస్య పండగను టీటీడీ జరుపుతుంది. అదే రోజున రాత్రి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఆ తర్వాత వేదాంత దేశిక ఉత్సవం నిర్వహిస్తారు. 15వ తేదీ నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 19వ తేదీన గరుడ సేవ, 20వ తారీఖు పుష్పక విమానం, సరస్వతి పూజ జరుపనున్నారు.

Read Also: KTR: వ్యర్థాల వాహనాలు.. నేడు లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్‌

అయితే, 21వ తేదీన దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమాలను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 22న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి, 23న చక్ర స్నానం, మహర్నవమి, విజయ దశమి, వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం పండగలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఇక, 24వ తేదీన పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 25 తేదీన మతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం షెడ్యూల్ ను టీటీడీ రిలీజ్ చేసింది. అయితే, 28న పాక్షిక చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అనంతరం మహా సంప్రోక్షణ కార్యక్రమంతో ఆ శ్రీనివాసుడి ఆలయ వాకిళ్లను తెరుస్తారు. 31వ తేదీన చంద్రోదయో వ్రతం జరుపుతారు.

Exit mobile version