Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tsrtc Unions Talks With Telangana Governor Tamilisai Soundararajan Over Tsrtc Bill Issue

TSRTC Bill: గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ యూనియన్‌ నేతల భేటీ.. అందుకే బిల్లు ఆపారట..!

Published Date :August 5, 2023 , 1:41 pm
By Sudhakar Ravula
TSRTC Bill: గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ యూనియన్‌ నేతల భేటీ.. అందుకే బిల్లు ఆపారట..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

TSRTC Bill: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ బిల్లు వ్యవహారం రాష్ట్రంలో కాక రేపింది.. ఓవైపు గవర్నర్‌పై అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బంద్‌కు పిలుపునిచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గంటల పాటు డిపోలకే పరిమితం అయ్యాయి బస్సులు.. ఇక, రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు కార్మికులు.. అందులో కొంతమంది నేతలను లోపలికి పిలిచి చర్చలు జరిపారు గవర్నర్‌ తమిళిసై.. కార్మిక సంఘాల నేతలు, గవర్నర్‌ మధ్య సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది.. ఆ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడుతూ.. చర్చల సారాశాంన్ని వివరించారు.

ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారని తెలిపారు ఆర్టీసీ యూనిన్‌ లీడర్‌ థామస్ రెడ్డి.. సుదీర్ఘంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించాం.. సమ్మె కాలంలో కూడా నేను మీకు సహకరించాను అని గుర్తుచేశారని తెలిపారు. ఇక, కార్మికుల మేలు కోసమే విలీనం విషయంలో ప్రభుత్వానికి ప్రశ్నలు రాశాను అని చెప్పారు.. ప్రభుత్వం కూడా సమాధానాలు రాసి పంపినట్లు తెలిసింది.. కానీ.. మా ఆఫీస్ కి ఇంకా అందలేదు అని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. ఆర్టీసీ బిల్లును ఆపడం నా ఉద్దేశం కాదు.. ప్రభుత్వానికి కొన్ని డౌట్స్ ఉన్నాయని రాసి క్లారిఫికేషన్ కోసం అడిగాను.. అసెంబ్లీ సెషన్ ముగిసే లోపు కచ్చితంగా ఆమోదించేoదుకు ప్రయత్నిస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. సత్వర పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ తెలిపారన్న ఆయన.. నేరుగా ఆమె ఏమైనా సవరణలు ఉంటే రాసి పంపడానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసమే.. నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను అని గవర్నర్ అన్నారని చెప్పుకొచ్చారు. గవర్నర్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా థామస్‌ రెడ్డి వెల్లడించారు.

Also Read

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
  • Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్‌ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..

మరోవైపు.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లే పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు?, అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Governor Tamilisai Soundararajan
  • hyderabad
  • rtc
  • telangana
  • TSRTC Bill

తాజావార్తలు

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!

  • Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..

  • Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!

  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..

  • Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్‌ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions