TSRTC: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మరుసటి రోజే.. ప్రయాణికులకు షాకిచ్చింది ఆర్టీసీ.. సిటీలో డే పాస్ ధరలు పెంచేసింది.. ఇప్పటి వరకు డే పాస్ ధర రూ.100గా ఉండగా.. ఇవాళ్టి నుంచి డే పాస్ ధర రూ.120కు పెంచింది టీఎస్‌ఆర్టీసీ.. ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ప్రకటించిన మరుసటి రోజే డేపాస్ ధరలను పెంచేశారు.. ఇక, గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలకు పెరిగింది.. అయితే, రూ.80 , రూ. 100గా ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.. 120 రూపాయలు డే పాస్ సమయంలో రోజుకీ 25 వేలు మాత్రమే అమ్ముడు అవుతున్నాయని.. అదే 80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకు అమ్మకాలు జరిగాయని చెబుతున్నారు సంబంధిత అధికారులు.. మళ్లీ పెరిగిన టికెట్ ధరలతో బాదుడు మొదలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.
Read Also: IND vs WI: భారత్‌తో టీ20 సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు ఆయేగా
గతంలో టీ-24 టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండేది. పర్యాటకులు కూడా ఈ ధరలతో నగరం మొత్తం తిరిగారు. సీనియర్ సిటిజన్లకు రూ.80కే అందించారు.. ఆ తర్వాత పాత ధరలనే అమలు చేసి రూ.100కి పెంచారు. తాజాగా ఆ ధరలను మళ్లీ రూ. 120కి పెంచారు.. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.. గ్రేటర్ పరిధిలో రోజుకు 20 వేల మంది ప్రయాణికులు టీ-24 టికెట్‌ను వినియోగిస్తున్నారని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. నగరంలోని రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లే వారు ఈ టికెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకుగాను అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణం తీసుకుందని సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ వెల్లడించిన విషయం విదితమే.