Site icon NTV Telugu

IPL: నేడు ముంబైతో హైదరాబాద్‌ ఢీ.. ఉప్పల్‌ స్టేడియానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Tsrtc

Tsrtc

ఐపీఎల్‌ 2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా మరో మ్యాచ్‌ జరగబోతోంది.. ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఢీకొనబోతోంది.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు జట్ల ప్రదర్శనకు పెద్ద తేడా ఏమీ లేదు.. ముంబై నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించగా.. హైదరాబాద్‌ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కిందినుంచి వరుసగా రెండు, మూడో స్థానాలకే పరిమితం అయ్యాయి.. అయితే, హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాబోతోందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Read Also: Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ ఉప్పల్‌ స్టేడియంలో తలపడనున్నాయి. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి.. నిన్న వర్షం కురవడంతో.. పిచ్‌ తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.. మరోవైపు.. మ్యాచ్‌కి వచ్చే అభిమానులకు ట్రాన్స్‌పోర్ట్‌ ఇబ్బంది లేకుండా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు.. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా, సురక్షితంగా ఉప్పల్‌ స్టేడియానికి, తిరిగి గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు టీఎస్ఆర్టీ ఎండీ వీసీ సజ్జనార్.

Exit mobile version