మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. దీని వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఆర్టీసీ చెప్పింది. అందుకే తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. తమ సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ కోరారు.
Read Also: Megastar Tweet: మై డియర్ దేవా… బాక్సాఫీస్ కి సెగలు పుట్టించావ్ కంగ్రాట్స్
అలాగే, కొందరు మహిళలు అనుమతించిన బస్టాప్ లలో కాకుండా కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు.. దీంతో ప్రయాణ సమయం పెరిగిపోతుంది.. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది అని సజ్జనార్ వెల్లడించారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.. కాగా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సరైన సమయంలో బస్సులు రావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ఫిర్యాదుల మీద స్పందించిన టీఎస్‌ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ప్రకటన చేసింది. ఆసక్తి ఉన్న వాళ్లు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని చెప్పింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని వెల్లడించారు.