NTV Telugu Site icon

TSRTC: కొత్తగా 100 బస్సులు ప్రారంభం..

Bus

Bus

హైదరాబాద్ ఎన్టీఆర్మార్గ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద TSRTC కొత్త బస్సులు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 100 కొత్త బస్సులు ప్రారంభించటం సంతోషకరం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలు నెరవేరుస్తుందని అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఆర్టీసీ పైన ఎలాంటి భారం తాము మోపలేదని పేర్కొ్న్నారు. ప్రతి పైసా ఆర్టీసీకి చెల్లిస్తున్నామని అన్నారు. 15 కోట్ల ప్రయాణికులు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు.. రాష్ట్రంలో తిరిగే ఆర్టీసీ బస్సులు 100 శాతం ఆక్యూపెన్సితో నడుస్తున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.

Amit Shah: ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ?.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి స్కీమ్తో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.. గతంలో రిటైర్డ్ వ్యక్తిని పెట్టి సంస్థను నడిపించారని అన్నారు. దీంతో ఆర్టీసీ నిర్వీర్యం అయ్యిందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఆర్టీసీ కుటుంబాల సమస్య ప్రభుత్వం పరిష్కరిస్తుంది.. రాబోయే కాలంలో ఆర్టీసి బలోపేతానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణలో బస్సుల డిమాండ్ బాగా పెరిగిందని.. సిబ్బంది నియామకాలు కూడా చేపడుతామని చెప్పారు. కాగా.. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Amit Shah: అయోధ్య ప్రాణప్రతిష్ఠపై లోక్‌సభలో అమిత్ షా స్పీచ్

ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ.. కొత్త 100 బస్సులు ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం మహాలక్ష్మి స్కీమ్కి ఉపయోగిస్తాం.. మిగతా సూపర్ లగ్జరీ బస్సులు శ్రీశైలంకి నడపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అతి తక్కువ సమయంలో మహాలక్ష్మి స్కీమ్ అమలు చేసిందని అన్నారు. దిగ్విజయంగా ఈ పథకం అమలు అవుతుంది.. ఈ రెండు నెలల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.507 కోట్లు నిధులు అందించిందని చెప్పారు. కోవిడ్, డీజిల్ ధరలు, సమ్మె కారణంగా ఆర్టీసీ నష్టాలు చవిచూశాయని అన్నారు. ఆర్టీసీలో కొద్దికొద్దిగా నష్టాలు తగ్గుతున్నాయి.. రూ. 115 కోట్ల నష్టాలు తగ్గించామని తెలిపారు. కాగా.. ప్రభుత్వం సహకారం ఇస్తే మరో 1000 బస్సులు కొనుగోలు చేయాలని చూస్తున్నామని సజ్జనార్ పేర్కొన్నారు.