టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పేపర్ లీకేజి సిట్ కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి కస్టడీలో నిందితులు ఎటువంటి సమాచారాన్ని తెలుపలేదని, పేపర్ లీకేజ్ లో అరెస్ట్ అయిన నిందితులు పూర్తి సమాచారాన్ని ఇవ్వడం లేదన్నారు. పేపర్ లీకేజ్ లో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పారని, పేపర్ లీకేజ్ లో మిగతా వారి పాత్ర బయటపడాల్సింది ఉన్నట్లు సిట్ వెల్లడించింది. పేపర్ లీకేజ్ కు ఉపయోగించిన పరికరాలపై నిందితులను ప్రశ్నించాలని, ప్రవీణ్ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే శమీం, రమేష్, సురేష్ లను అరెస్టు చేసామని సిట్ వెల్లడించింది.
Also Read : Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!
కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని సిట్ తెలిపింది. నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన లక్షలాదిమంది భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉందన్న సిట్.. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల కస్టడీ అత్యంత అవసరమని తెలిపింది. దీంతో.. మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఏ -1 ప్రవీణ్,ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్, లను కస్టడీ అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులను విచారించునున్నారు సిట్ అధికారులు. రేపటి నుండి మంగళవారం వరకు కస్టడీ లోకి తీసుకుని సిట్ అధికారులు విచారించునున్నారు. మిగిలిన ముగ్గురు కస్టడీ పిటిషన్ ను సోమవారం వాయిదా వేసిన నాంపల్లి కోర్టు.. ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్ ల కస్టడీ పిటిషన్ ఎల్లుండికి వాయిదా వేసింది.
Also Read : Threat: జీ-20 వేదికపై భారత జెండాను తొలగిస్తామని బెదిరింపులు.. విచారణ ప్రారంభం