NTV Telugu Site icon

Group-1 Exam: నేడే గ్రూప్-1 పరీక్ష.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్..

Group1

Group1

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత హోదాగా భావించే గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ ఎక్సామ్ స్టార్ట్ కానుంది. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో గత అక్టోబర్‌ 16న నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దైంది. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షను ఇవాళ తిరిగి నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. నేటి ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించనుంది. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసిన కమిషన్‌… పరీక్షను సక్సెస్ పుల్ గా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

Read Also: Cyclone Biparjoy: తీవ్రమైన బిపర్ జోయ్ తుపాన్.. రానున్న 24గంటలు జాగ్రత్త

అయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్‌ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్‌ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను కమిషన్ రద్దు చేసింది.

Read Also: Karnataka : భర్తపై భార్య అత్యాచారం కేసుపై స్టే విధించిన హైకోర్టు..

ప్రిలిమినరీ పరీక్షను మరోసారి నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు సైతం మరింత కఠినంగానే సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రానికి 3,00,836 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. 33 జిల్లాల పరిధిలో 994 కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. ప్రతి జిల్లా కలెక్టర్‌ను జిల్లా అథారిటీగా కమిషన్‌ బాధ్యతలు అప్పగించింది. కాగా, పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.

Read Also: Kshama Bindu: తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా బిందు .. గ్రాండ్ గా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్..వీడియో వైరల్

గ్రూప్-1 ప్రిలిమినరి రాసే అభ్యర్థులు ఒరిజినల్‌ హాల్‌టికెట్‌తో హాజరుకావాలి.. అలాగే హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా లేకుంటే మూడు ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి సంతకంతో కూడిన హాల్‌టికెట్‌తో హాజరుకావాలి.. అభ్యర్థులు తప్పకుండా గుర్తింపు కార్డు (పాన్, ఆధార్, ఓటర్‌ ఐడీ తదితరాలు)ను వెంట తెచ్చుకోవాలి అని చెప్పారు.

Read Also: Viral News : బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. చివరికి లెటర్ తో..

పరీక్షా హాల్లోకి అభ్యర్థులను అనుతించే విషయంలో టీఎస్పీఎస్సీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు వేసేస్తామని చెప్పారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు.. అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకోవాలి.. బూట్లు వేసుకోకుడదు.. బెల్టు ధరించిన అభ్యర్థులను సైతం పక్కాగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు.. పరీక్ష తీరును పరిశీలించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు కమిషన్‌ అధికారులు తెలిపారు.