Site icon NTV Telugu

TSLPRB : పోలీస్‌ అభ్యర్థులకు శుభవార్త.. హైకోర్టు ఆదేశాలతో రీ మెజర్మెంట్‌కు అవకాశం

Tslprb

Tslprb

పోలీస్‌ ఉద్యోగార్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇటీవల నిర్వహించి మెజర్‌మెంట్‌ టెస్ట్‌ల్లో 1 సెంటిమీటర్‌, అంతకంటే తక్కువ అనర్హత పొందిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు ఒక సెంటీమీటర్, ఆ లోపు హైట్ తక్కువుండి అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరోసారి హైట్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.

Also Read : INDvsAUS Test: వైస్ కెప్టెన్‌నే పక్కన పెట్టేశాడు.. హర్భజన్ ఫైనల్ ఎలెవన్ ఇదిగో!

అయితే.. హైదరాబాద్ అంబర్ పేటలోని స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ సిటీ పోలీస్ లైన్స్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది. దీనికి హాజరుకావాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు www.tslprb.in వైబ్సైట్‌లో లాగినై ఆన్ లైన్‌లో అప్లికేషన్లు సమర్పించాలని స్పష్టం చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. టెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు రీ మెజర్మెంట్కు సంబంధించిన అప్లికేషన్ కం అడ్మిట్ కార్డ్ను వెంట తీసుకురావాలని లేనిపక్షంలో టెస్ట్కు అనుమతించమని వెల్లడించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.

Also Read :Valentine’s Day: వాలెంటైన్స్ డేని “కౌ హగ్ డే”గా జరుపుకోండి

Exit mobile version