Polycet 2025: పాలీసెట్-2025 పరీక్షకు సర్వం సిద్ధం.. ఒక్క నిమిషం ఆలస్యం అయిన ‘నో ఎంట్రీ’
- మే 13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (పాలీసెట్ 2025)
- ఉ. 11.00 గం. నుండి మ. 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష.
- అమలులో ఒక్క నిమిషం రూల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polycet 2025: పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (పాలీసెట్ 2025) పరీక్షను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా.. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై మే 13వ తేదీ (మంగళవారం) రోజున ఉ. 11.00 గం. నుండి మ. 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుటకై నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యబడ్డాయి.
Read Also: Pan India Movies : మెసేజ్ వద్దు.. హింసనే ముద్దు.. పాన్ ఇండియా మూవీలు మారవా..?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
పాలీసెట్-2025 కు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,716 మంది అభ్యర్థులు 276 పరీక్ష కేంద్రాలలో హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి ఒక గంట ముందుగానే అనుమతిస్తారు. కాబట్టి విద్యార్ధులు ఉ.10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని OMR షీట్ లోని రెండు వైపుల వివరాలను పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుంది. విద్యార్థులు తమ వెంట HB బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పక తీసుకొని రావలెను. పరీక్ష ప్రారంభం అయిన (ఉ 11.00 గం.) తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన అభ్యర్థిని పరీక్ష కేంద్రం లోనికి అనుమతించబడరు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో, ID ప్రూఫ్ (ఆధార్ కార్డు) తెచ్చుకోవలెను. అలాగే పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ కానీ, ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అనుమతించబడవు.
ఇక ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం 60 మార్కులు, భౌతిక శాస్త్రం 30 మార్కులు, రసాయన శాస్త్రం 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది. వ్యవసాయం, ఉద్యానవన, వేటరినరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా జీవశాస్త్రంలో మరో 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇక పరీక్ష కేంద్రాన్ని గుర్తించడానికి విద్యార్థులు ఈ సూచనలను అనుసరించాలి. అందులో మొదటగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుండి SBTET TG యాప్ ను డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసి, పరీక్షా కేంద్రం లోకేషన్ కై POLYCET Exam సెంటర్ లొకేటర్ టాబ్ ని తెరవండి.
Read Also: Pan India Movies : మెసేజ్ వద్దు.. హింసనే ముద్దు.. పాన్ ఇండియా మూవీలు మారవా..?
ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి, సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. అంతే పరీక్షా కేంద్రం కోడ్, విద్యార్థి పేరు, సెంటర్ చిరునామా కనపడతాయి. గూగుల్ మ్యాప్స్ ద్వారా విద్యార్థి స్థానం నుండి పరీక్షా కేంద్రం దూరాన్ని తక్షణమే యాక్సెస్ చేయవచ్చు. ఇది సరైన సమయానికి చేరుకోవడానికి సరైన మార్గాన్ని నావిగేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!