Pan India Movies : మన దేశంలో ప్రజలపై సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. అది మంచి అయినా.. చెడు అయినా.. సినిమాలను చూసి టీనేజ్, యూత్ బాగా ఫాలో అవుతుంది. ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అలాంటప్పుడు టాలీవుడ్ నుంచి మెసేజ్ ఉన్న సినిమాలు రావాలని అంతా కోరుకుంటున్నా.. ఇప్పుడు అలాంటి సినిమాలే కరువయ్యాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ.. వీరందరూ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేశారు.
Read Also : Vennela Kishore : మహేశ్ పక్కన ఆ పాత్ర చేయడమే నా డ్రీమ్..
ఒక నిజాయితీ గల ఆఫీసర్ పాత్రలు చేసి అన్యాయాన్ని ప్రశ్నించడం చూపించారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత నిజాయితీగా ఉండాలో వీరి సినిమాల్లో చూశాం. ఒక ఐఏఎస్ అధికారి సమాజం కోసం ఎంతగా పాటు పడుతాడో మోహన్ బాబు సినిమాలో చూశాం. అదే ప్రభుత్వం తప్పు దోవలో నడిస్తే ఎలా కరెక్ట్ చేయాలో చిరంజీవి ఠాగూర్ సినిమాలో చూశాం. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో వెంకటేశ్ ను చూశాం. ఇక సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు అయితే.. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి సమాజానికి ఎన్నో మెసేజ్ లు ఇచ్చారు. ఒక రకంగా వారి సినిమాలు ప్రశ్నించడాన్ని నేర్పాయి. చట్టాలు ఎలా పనిచేస్తాయో చూపించాయి.
అప్పట్లో చదువుకున్న ప్రజలు పెద్దగా చదువుకోలేదు కాబట్టి వారిని చైతన్యవంతం చేసేందుకు వీళ్ల సినిమాలు ఉపయోగపడ్డాయి. మద్యానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా చిరంజీవి ఎన్నో సినిమాలు చేశారు. అప్పట్లో వారి సినిమాల్లో హింస కంటే మెసేజ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా రివర్స్. పేరుకే వందల కోట్ల బడ్జెట్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు. అందులో చూపించేది మాత్రం హింసనే ఎక్కువగా ఉంటోంది. ఎన్ని తలలు నరికితే.. ఎంత పవర్ ఫుల్ యాక్షన్ సీన్లు చేస్తే అంత స్టార్ డమ్ అన్నట్టు మారిపోయింది. ఇప్పుడు హీరో అంటే కత్తి పట్టాల్సిందే. వందల మందిని చంపాల్సిందే. రక్తం పారాల్సిందే అన్నట్టు తయారయ్యాయి సినిమాల కథలు.
మాస్ ఇమేజ్ పేరుతో మితిమీరిన యాక్షన్, రొమాన్స్ సినిమాలు చేస్తున్నారు. ఇవి చూసి ఇప్పటి టీనేజ్, యూత్ మాత్రమే కాదు.. పదేళ్ల వయసున్న పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. వాటి డైలాగులు, మేనరిజాలు ప్రాక్టీస్ చేస్తూ.. మరింత వైలెంటిక్ గా పిల్లలు తయారవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకే ఎదురు తిరిగే స్థాయిలో సినిమాల ప్రభావం ఉంటోంది. ఎందుకంటే ఆ సినిమాల్లో సమాజానికి మెసేజ్ ఇవ్వడం అనేది పక్కన పెట్టేశారు. ఏమైనా అంటే మెసేజ్ సినిమాలు ఎవరూ చూడట్లేదని.. మాస్ సినిమాలే చూస్తారంటూ చెబుతున్నారు. నిజానికి మెసేజ్ ఇచ్చే మూవీలు కూడా ఆడుతాయి. కాకపోతే వాటిని తెరకెక్కించే విధానంలోనే అంతా ఉంటుంది. అందరినీ నచ్చే విధంగా తీస్తే ఎలాంటి మెసేజ్ ఉన్న సినిమా అయినా ఆడుతుంది. ఈ విషయంలో డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు చాలా మారాలి. మెసేజ్ ఉన్న మూవీలు చేయాలి. సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి.
Read Also : Samantha : నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు : సమంత