TS Eamcet 2022 : రేపు ఉదయం 11 గంటలకు ఎంసెట్ ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడుతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు జులై 30, 31 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అయితే.. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీఎస్ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఉదయం 11:45 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసెట్ ఫలితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా గత నెలలో షెడ్యూల్ చేసిన ఎంసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే రెండు విడుతల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!