NTV Telugu Site icon

TS Cabinet : రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Cm Kcr

Cm Kcr

రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది . ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కాగా కవిత రిక్వెస్ట్ మేరకు ఈడీ ఆమెను ఈనెల 11న విచారించనుందని సమాచారం. అయితే.. ఈ క్రమంలోనే.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారన్నారు. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : Minister KTR : మోడీ ప్రియమైన ప్రధాని కాదు… పిరమైన ప్రధాని

కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని కవితకు భరోసా ఇచ్చారు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం చేద్దామని తన కుమార్తె కవితకు కేసీఆర్‌ ధైర్యం చెప్పారని, పార్టీ అండగా ఉంటుందంటూ కవితకు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 10న గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. దీనికోసం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.

Also Read : Car Falls Into Gorge: లోయలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. మరో ఘటనలో ఐదుగురు

Show comments