మీకు స్కిన్ అలర్జీ ఉందా? చర్మంపై దద్దుర్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో చాలా మందికి అర్థం కాదుు. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇంటి చిట్కాలతో స్కిల్ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. చర్మ అలెర్జీ విషయంలో కొన్నిసార్లు మీ శరీరంపై లేత ఎరుపు రంగు మచ్చలను కలిగిస్తుంది. కొన్ని అలెర్జీలు తేలికపాటివి, కొన్ని తీవ్రంగా ఉండవచ్చు. కొన్ని అలర్జీలను మందులతో నయం చేయవచ్చు. కానీ తేలికపాటి అలర్జీలను నిర్వహించడంలో సహాయపడే కొన్ని గొప్ప ఇంటి నివారణలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Read more : JIO Mart: క్విక్ కామర్స్‌లోకి జియోమార్ట్.. మొదట ఆ నగరాల్లో మాత్రమే..?!
మొదటిది వేప. వేపాకు చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. అందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మ అలెర్జీలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేప నూనెను ప్రభావిత ప్రాంతంలో రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. వేప నూనెను ఉపయోగించడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు నుంచి ఉపశమనం లభిస్తుంది. మరో ఆయుర్వేద పత్రం తులసి. ఇది సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. చర్మ అలెర్జీలు ఉంటే, తులసి ఆకులను తీసుకొని పేస్ట్ చేయండి. ప్రభావిత ప్రాంతంలో ఈ పేస్ట్‌ను అప్లై చేయండి. పేస్ట్ ఆరిపోయినప్పుడు, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ అలర్జీలను దూరం చేయడంలో సహాయపడతాయి. అప్లై చేసిన15 నిమిషాల తర్వాత కడగండి.
Read more : Maruti Suzuki : కార్ల ధరలు మరింత తగ్గించిన మారుతీ సుజుకీ
టీ ట్రీ ఆయిల్ లో చా యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఉంటాయి. ఈ ఆయిల్ చర్మం ఎరుపు, దురదను తొలగించడానికి ఒక గొప్ప మార్గం. ఆలివ్ ఆయిల్ చర్మంపై అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. విటమిన్ E సమృద్ధిగా ఉన్న ఆలివ్ ఆయిల్ మీ అలెర్జీ సంబంధిత సమస్యలకు చికిత్స చేస్తుంది. బేకింగ్ సోడా చర్మ అలెర్జీలకు ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి. ఇది చర్మపు దద్దుర్లు తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని కొద్దిగా నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి అలర్జీ ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై రాయండి. కొబ్బరి నూనె చర్మానికి పోషణను అందించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రభావిత చర్మం ప్రాంతంలో కొబ్బరి నూనెను సున్నితంగా అప్లై చేయండి. మంచి ఫలితం లభిస్తుంది.