Site icon NTV Telugu

Donald Trump: “మస్క్ ఓ అద్భుతం”.. పదవి నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసలు..!

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ బిలియనీర్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంలో వ్యర్థ ఖర్చుల నివారణ కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్ పదవి నుంచి మస్క్ తప్పుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా “ఎలాన్ మస్క్ అద్భుతమైన వ్యక్తి. ఇది ఆయన చివరి రోజు అయినా, ఆయన మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ సహాయపడుతూనే ఉంటారు” అని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒవల్ ఆఫీసులో ట్రంప్-మస్క్ కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Read Also: India China: పాక్ ప్రయోగించిన PL-15E క్షిపణిని కూల్చేసిన భారత్.. తొలిసారి స్పందించిన చైనా.

ఇకపోతే, DOGE చీఫ్‌గా తన పాత్ర ముగిసిన అనంతరం మస్క్ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా కాలపరిమితి ముగియడంతో ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని.. ప్రభుత్వ వ్యర్థ ఖర్చులను తగ్గించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలంటూ అన్నారు. DOGE మిషన్ ఇప్పటి కంటే భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని మస్క్ అన్నారు. ఇకపోతే, ఈ వారం ప్రారంభంలో మస్క్ మాట్లాడుతూ.. తాను తిరిగి పూర్తి స్థాయిలో కార్పొరేట్ జీవితంలోకి ప్రవేశించానని, 24/7 పని చేస్తూ కాన్ఫరెన్స్ రూముల్లోనే నిద్రపోతున్నానని పేర్కొన్నారు.

Read Also: Radhika Apte : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే.. ఇదిగో క్లారిటీ..

అయితే, మస్క్ తన పదవీ విరమణకు కొద్ది గంటల ముందు ట్రంప్ ప్రవేశపెట్టిన ముఖ్యమైన పన్ను బిల్లును తీవ్రంగా విమర్శించారు. ఒక బిల్లు పెద్దదిగా ఉండవచ్చు, లేదా అందంగా ఉండవచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండడం నాకు తెలీదు అని వ్యాఖ్యానించారు. ఇది DOGE కార్యాలయం లక్ష్యాలను దెబ్బతీయవచ్చని ఆయన అభిప్రాయం. DOGE శాఖ లక్ష్యం ప్రభుత్వాన్ని దృఢంగా, సరళంగా మార్చడం. వ్యర్థ ఖర్చులను తొలగించడం, విభాగాలను మూసివేయడం, పరిపాలనను సులభతరం చేయడం వంటి కీలక నిర్ణయాల్లో మస్క్ ముందుండి నడిపించారు. అయితే, ఏప్రిల్ చివరి నుంచి మస్క్ దశల వారీగా తన పాత్ర నుంచి పక్కకు వెళ్లడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలతో మస్క్ అమెరికన్ పాలనలోని అతిథి పాత్ర ముగిసినా.. ఆయన ప్రభావం మాత్రం కొనసాగనుంది.

Exit mobile version