US Tariffs: భారత్‌పై టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్.. 25% కాదు.. 50% ఫిక్స్..

Trump Tariffs

Trump Tariffs

Trump Slaps 50% Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది.

READ MORE: AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్‌ కామెంట్లు..

×
×
Ad

నిజానికి.. గతంలో అమెరికా భారత్‌పై 25 శాతం సుంకం మాత్రమే ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ తన మనసు మర్చుకున్న ట్రంప్ మరో 25% అదనంగా యాడ్ చేశారు. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వు ప్రకారం.. ఈ సుంకం 21 రోజుల్లోపు, అంటే 2025 ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఈ కొత్త సుంకం వర్తిస్తుంది. అయితే.. ఈ తేదీకి ముందు బయలుదేరి 2025 సెప్టెంబర్ 17 కి ముందు అమెరికాకు చేరుకున్న వస్తువులు ఈ సుంకం నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఉన్న పన్నులకు ఈ సుంకం అదనమని.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు ఇస్తామని యూఎస్ ప్రకటించింది.

READ MORE: AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్‌ కామెంట్లు..