Palestine President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక బాంబ్ పేల్చారు. ఇంతకీ ఏంటదని అనుకుంటున్నారా.. గాజా ఒప్పందం గురించి ప్రపంచానికి తెలుసుకదా.. ఇదే సమయంలో ట్రంప్ తదుపరి పాలస్తీనా అధ్యక్షుడి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇక్కడే ఆయన బాంబు పేల్చింది.. ఇంతకీ ఆ బాంబు ఎవరి కొంప ముంచిందని ఆలోచిస్తున్నారా.. మహమూద్ అబ్బాస్‌ది.. ఎందుకంటే తాజాగా ట్రంప్ జారీ చేసిన ముఖ్యమైన ప్రకటనలో మహమూద్ అబ్బాస్ స్వతంత్ర పాలస్తీనా అధ్యక్షుడు కాలేరని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలో ఏం ఉందంటే..
READ ALSO: Kurnool Bus Fire : ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
ఆయన తెలివైనవారే కానీ..
ట్రంప్ తన ప్రకటనలో.. మహమూద్ అబ్బాస్ కచ్చితంగా తెలివైనవారే, కానీ ఆయన ప్రస్తుతం పాలస్తీనాకు అవసరమైన నాయకుడికి సరిపోరని వెల్లడించారు. ప్రస్తుతం మహమూద్ అబ్బాస్ పాలస్తీనా అథారిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం కొత్తగా పాలస్తీనా దేశం ఏర్పడిన తర్వాత ఆయన దానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని భావించారు. కానీ ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా ఆయన నాయకత్వంపై నీలినీడలు కమ్మాయి.
ట్రంప్ మద్దతు ఎవరి కంటే..
ఇటీవల డోనాల్డ్ ట్రంప్ టైమ్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. “నేను మహమూద్ అబ్బాస్‌ను కలిశాను. ఆయనకు పాలస్తీనా గురించి కచ్చితంగా అవగాహన ఉంది, కానీ ఆయన ప్రస్తుతం దాని నాయకుడు కాలేడు” అని అన్నారు. అలాగే ట్రంప్ అబ్బాస్‌ను వృద్ధుడిగా అభివర్ణించారు. అలాగే ట్రంప్ మాట్లాడుతూ.. “ఇజ్రాయెల్ జైలులో ఉన్న మార్వాన్ అల్-బర్ఘౌటి విడుదల గురించి నేను బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడుతాను. ఆయనను వెంటనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను” అని అన్నారు. వాస్తవానికి బర్ఘౌటీని పాలస్తీనా కొత్త అధ్యక్షుడిని చేయాలని హమాస్ ప్రయత్నిస్తోంది. 2002లో బర్ఘౌటీని ఇజ్రాయెల్ అరెస్టు చేసి అప్పటి నుంచి జైలులో ఉంచారు. చాలా మంది మార్వాన్ బర్ఘౌటీని పాలస్తీనా ప్రతిఘటనకు ప్రధాన నాయకుడిగా భావిస్తారు.
ఇంతకీ మహమూద్ అబ్బాస్ ఎవరు?
మహమూద్ అబ్బౌద్ పాలస్తీనా అథారిటీ అధిపతి. అబ్బాస్ 2005 లో ఈ బాధ్యతను స్వీకరించారు. యాసర్ అరాఫత్ పాలస్తీనా అథారిటీకి మొదటి అధిపతి. 1935 లో పాలస్తీనా గలిలీలో జన్మించిన అబ్బాస్ సిరియాలో విద్యను అభ్యసించారు. పాలస్తీనా అథారిటీ అధిపతి కావడానికి ముందు, ఆయన దాని ప్రధాన మంత్రిగా పనిచేశారు. మహమూద్ అబ్బాస్ యాసర్ అరాఫత్‌తో కలిసి పాలస్తీనా ఉద్యమంలో చేరారు. ప్రస్తుతం, అబ్బాస్ ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాలస్తీనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పాలస్తీనాలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయన అమెరికా, యూరోపియన్ దేశాల ఆదేశానుసారం ప్రవర్తిస్తాడని చాలా మంది పాలస్తీనియన్లు అంటున్నారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కూడా అబ్బాస్‌ను దేశ అధ్యక్షుడిగా కావడానికి ఇష్టపడటం లేదు.
గాజా ఒప్పందం తర్వాత, పాలస్తీనాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ ప్రభుత్వంలో ఎటువంటి పాత్రను కలిగి ఉండదు. అదే సమయంలో హమాస్ గాజాలో ఏ బయటి ప్రభుత్వాన్ని అంగీకరించబోమని కూడా వాదిస్తోంది. గాజా చుట్టూ ఉన్న గందరగోళానికి ఇదే కారణంగా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Afghanistan: భారత్ బాటలో ఆఫ్ఘన్.. తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్‌కు నీటి గండం ఖాయం!