Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చేసిన వార్త అవుతుంది. తాజాగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ఆదివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన తర్వాత ట్రంప్ మలేషియాకు రావడం ఇదే మొదటిసారి. ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికాకు ఇక్కడ బలమైన భాగస్వాములను నిర్మించడంపై ఈ పర్యటనలో ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు.
READ ALSO: Kavitha: బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే బీసీ బిల్లుకు మోక్షం..
డాన్స్ చేసిన ట్రంప్..
కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ట్రంప్ స్థానిక కళాకారులతో కలిసి డాన్స్ చేశారు. వాషింగ్టన్ నుంచి 23 గంటల విమాన ప్రయాణం తర్వాత మలేషియా చేరుకున్న 79 ఏళ్ల ట్రంప్ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగిన తర్వాత ఆయనకు కౌలాలంపూర్ విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తనను స్వాగతించడానికి విమానాశ్రయంలో ఉన్న స్థానిక కళాకారులతో కలిసి ట్రంప్ ఉత్సాహంగా కాలు కదిపారు. రంగురంగుల దుస్తులు ధరించిన కళాకారులు.. బోర్నియో స్థానిక ప్రజలు, మలేషియా, చైనీయులు, భారతీయులతో సహా మలేషియాలోని ప్రధాన సమాజాలకు ప్రాతినిధ్యం వహించారు.
అధ్యక్షుడు ట్రంప్ స్వాగత వేడుకను మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం పర్యవేక్షించారు. ఆయన కూడా ట్రంప్‌తో కలిసి సంగీతానికి అనుగూణంగా కాలుకదిపారు. అలాగే ఎంబసీ అధికారులు, పెద్ద సంఖ్యలో జనసమూహం అమెరికన్, మలేషియా జెండాలను ఊపుతూ చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. ఐదు రోజుల ఆసియా పర్యటనకు వచ్చిన ట్రంప్.. మలేషియాతో అమెరికా వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనున్నారు. ఆయన మలేషియాలో జరిగే ASEAN శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టోక్యోకు వెళతారు. అక్కడ కొత్తగా ఎన్నికైన జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడి నుంచి ఆయన దక్షిణ కొరియాలోని జియోంగ్జుకు వెళ్లి, ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరవుతారు.
ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ట్రంప్ – చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ట్రంప్ – జిన్‌పింగ్ వాణిజ్య చర్చలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలను చర్చిస్తారని సమాచారం. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జరిగే సమావేశంలో తైవాన్ సమస్య, హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల నాయకుడు జిమ్మీ లై విడుదల గురించి కూడా ట్రంప్ చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు – ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో డీమిలిటరైజ్డ్ జోన్ (DMZ)లో అనధికారిక సమావేశం కూడా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
READ ALSO: RashmikaMandanna : బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టిన రష్మిక
TRUMP DANCE — MALAYSIA EDITION! 🔥🔥🔥 pic.twitter.com/HLyCVaCndh
— Rapid Response 47 (@RapidResponse47) October 26, 2025