Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంయుక్తంగా చేపట్టిన నిర్ణయం దేశంలో భారీ పరిణామాలకు దారి తీసింది. ప్రస్తుతం 10,000 మంది ఫెడరల్ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించడంతో దేశంలోని అనేక రంగాల్లో సంచలనంగా మారింది. ఈ ఉద్యోగులలో 2 సంవత్సరాల కన్నా తక్కువ కాలం పనిచేసిన వారే ఉండటం గమనార్హం. ప్రస్తుతం, అమెరికాలో 23 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఇది తీసుకున్న పెద్ద అడుగుని భావిస్తున్నారు. గురువారం, శుక్రవారం రోజుల్లో 9,500 మందిని తొలగించడం జరిగింది. మరో 75,000 మంది ఉద్యోగులు ‘కొనుగోలు’ ఆప్షన్‌ను అంగీకరించారు. ఈ కొనుగోలు ఎంపికలో భాగంగా ఉద్యోగులు కొన్ని నెలల పాటు జీతం అందుకుంటూ, తాము రాజీనామా చేసే దిశగా నిర్ణయం తీసుకుంటారు.
కొనుగోలు ఆఫ్షన్ అనేది ఉద్యోగులు రాజీనామా చేయడానికి ముందుగా కొన్ని నెలల జీతం అందుకుంటూ, తమ ఉద్యోగాల నుండి బయటపడే ప్రక్రియ. ఈ ఏడాది చివర్లో ఈ ఉద్యోగులు తమ రాజీనామాలను సమర్పిస్తారని అంగీకరించారు.
ఫెడరల్ ఏజెన్సీలపై ప్రభావం
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం హోంల్యాండ్ సెక్యూరిటీ, నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) వంటి పెద్ద ఫెడరల్ ఏజెన్సీలపై పెద్ద ప్రభావం చూపింది. ఫెడరల్ ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా, ప్రస్తుతం అమెరికా 36 ట్రిలియన్ డాలర్ల అప్పును కలిగి ఉంది, గత సంవత్సరం 1.8 ట్రిలియన్ డాలర్ల లోటును ఎదుర్కొంది.
Read Also:TTD Big Alert: తిరుమల వెళ్లే భక్తులకు షాక్.. రాత్రి 9 తర్వాత ఆ రూట్లు బంద్!
ఎటువంటి ఏజెన్సీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి?
ట్రంప్ నిర్ణయం వల్ల అంతర్గత వ్యవహారాల శాఖ (Department of Interior) అత్యధిక నష్టాన్ని చవిచూసింది. ఈ శాఖ 2,300 మందిని తొలగించింది. ఇంధన శాఖ కూడా 1,200 నుండి 2,000 మందిని తొలగించింది. వ్యవసాయ శాఖ 3,400 మంది ఉద్యోగులను తొలగించింది.
ఉద్యోగుల పరిస్థితి
ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోవడం చాలా కష్టమైన అంశం. అలా ఉద్యోగం కోల్పోయిన 10,000 మంది కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలపై ఆశ్చర్యానికి గురయ్యారు. 17 సంవత్సరాల పాటు రక్షణ శాఖలో పనిచేసిన నిక్ గియోయా, “నా దేశం కోసం నేను చాలా చేశాను, కానీ ఇప్పుడు నా దేశం నాకు మోసం చేసినట్లు అనిపిస్తుంది” అని చెప్పారు. ఈ నిర్ణయం జాతీయంగా, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక ప్రభావం చూపగలదు. 10,000 మందికి ఉద్యోగం కోల్పోయి, చాలా మందికి కొత్త ఉద్యోగం రానట్లు కనిపిస్తోంది.
Read Also:Earthquake: రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు