Site icon NTV Telugu

Tragedy : అక్కతో లొల్లి.. ఇద్దరు బావమర్దులను చంపిన బావ

Murder

Murder

Tragedy : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే విధి మండలంలోని చింతపల్లి క్యాంపు గ్రామం సోమవారం ఉదయం భయానక ఘటనకు వేదికైంది. కుటుంబ కలహం ఉద్ధృతంగా మారి, చివరికి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యతో జరిగిన ఘర్షణతో ఆగ్రహానికి గురైన భర్త, జోక్యం చేసుకున్న తన ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

DRDO : భారత్-పాక్‌ యుద్ధంలో హైదరాబాద్‌ డీఆర్‌డీవో కీలక పాత్ర

హత్యకు గురైన వారు కిముడు కృష్ణ మరియు కిముడు రాజు. వీరిద్దరూ తమ అక్కను భర్త వేధిస్తుంటే సహించలేక గెన్ను అనే బావతో వాగ్వాదానికి దిగారు. వాదన ఉద్రిక్తంగా మారి, మానసిక ఆవేశంతో గెన్ను త్రిశూలంతో దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ప్రాణాలను అక్కడికక్కడే ఖతం చేశాడు. ఈ దారుణ ఘటనను ఆపబోయిన మరో గ్రామస్థుడు కూడా గాయపడగా, అతన్ని వెంటనే విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక మృతదేహాలను స్థానిక సీలేరు ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ విభేదాలు ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Health Tips: ఐస్ క్రీం తింటున్నారా?.. ఈ ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్లే!

Exit mobile version