Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha Krishnan: కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష, తాజాగా తన కొత్త సినిమా ‘కరుప్పు’ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో అభిమానులు ఆమె కారును చుట్టుముట్టగా, ఒక అభిమాని తమిళంలో మాట్లాడుతూ.. “సీఎం విజయ్ను నేను అడినట్లు చెప్పండి” అని త్రిషకు చెప్పాడు. దానికి త్రిష తెగ సిగ్గుపడింది. నవ్వుతూ “సరే” అని సమాధానమిస్తూ సిగ్గుపడటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు అభిమానులు త్రిష ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం విజయ్ భార్య సంగీత పేరును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య అఫైర్ నడుస్తోందంటూ తమిళ పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. విజయ్‌కు ఇంకా అధికారికంగా విడాకులు కాకపోవడం, మరోవైపు తన కో-స్టార్‌తో ఉన్న సంబంధాల వల్లే ఆయన భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. త్రిష ప్రవర్తనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా.. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ‘కరుప్పు’ ఎన్నో ఇబ్బందుల ఎట్టకేలకు విడుదలైంది. మొదట మే 14న పడాల్సిన షోలు రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారమవడంతో మే 15న విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో ఓ థియేటర్‌కు దర్శకుడు ఆర్జే బాలాజీతో పాటు హీరో కార్తి, నటి త్రిష హాజరై అభిమానుల్లో జోష్ నింపారు. అభిమానుల ఉత్సాహం చూసి దర్శకుడు ఉద్వేగానికి గురయ్యారు. త్రిష ఆయనను హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
"Thalapathy ah kettenu sollunga"
Trisha replies, "Kandipa" 😅❤️ pic.twitter.com/CLZUTP3QIn— Deepu (@deepu_drops) May 15, 2026
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!