Trisha : 40ఏళ్లు వయసు మీద పడినా.. ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు దాటినా త్రిష ఇంకా కోలీవుడ్, టాలీవుడ్‌లో పెద్ద హీరోలతో వరుసగా సినిమాలను చేస్తోంది. బాలీవుడ్‌లో అతి కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే లేటు వయసులో అందాలను ఆరబోస్తు వరుసగా హీరోయిన్స్‌గా సినిమాలు చేస్తూ ఉన్నారు. దక్షిణాదిలో త్రిష స్థాయి సీనియర్ హీరోయిన్లు.. ప్రస్తుతం అవకాశాల్లేక బిజీగా లేరనే చెప్పుకోవాలి. కొందరు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నా వారు తల్లి వదిన క్యారెక్టర్లతో సరిపుచ్చుకుంటున్నారు. కానీ త్రిష మాత్రం తెలుగులో చిరంజీవితో నటిస్తూ ఉండగా, తమిళ్‌లో సూపర్ స్టార్‌తో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
Read Also:CM Revanth Reddy: నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్..
తెలుగు, తమిళంలో దాదాపు అందు సీనియర్ హీరోలతో, యంగ్ హీరోలతో నటించిన త్రిష ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్‌తో కలిసి నటించిన వర్షం గురించిన విషయాలను పంచుకుంది. వర్షం సినిమా కోసం తాను ఏకంగా 40 రోజుల పాటు నీటిలో తడుస్తూ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపింది. షూటింగ్ ప్రారంభానికి ముందే నీటిలో ఎక్కువగా తడుస్తూ నటించాల్సి ఉంటుందని ఆ సినిమా డైరెక్టర్ శోభన్ చెప్పారు. కానీ ఆ స్థాయిలో నీటిలో తడుస్తూనే ఉండాలని నేను అనుకోలేదు. ఎక్కువ రోజులు నీటిలో తడుస్తూనే షూట్ లో పాల్గొన్నాను. సన్నివేశాలు కాకుండా పాటలను సైతం వర్షంలో షూట్ చేశారు.
Read Also:Wazedu SI: నేడు వాజేడ్ ఎస్ఐ హరీష్ అంత్యక్రియలు
ఆ దెబ్బకు వర్షంలో షూటింగ్ అంటేనే భయం వేసింది. బాబోయ్ వర్షం సినిమానా, బాబోయ్ నీటిలో సీన్లు ఉన్నాయా అని భయపడ్డారు. వర్షం సినిమాలో నటించిన తర్వాతే త్రిషకి స్టార్‌డమ్ దక్కింది. ప్రభాస్ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకోగా, త్రిషకి టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ వచ్చాయి. అయినా వర్షం సినిమాలోని వర్షపు నీటిలో సన్నివేశాలు అంటే ఇప్పటికీ బాబోయ్ అనిపిస్తుందని త్రిష ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రభాస్, త్రిషలది వర్షంతో హిట్ పెయిర్ కావడంతో ఆ తరవ్ఆత వీరిద్దరి కాంబోలో పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్ల అయినా ఇద్దరూ కలిసి నటించలేదు.