NTV Telugu Site icon

Crime News: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

Rape

Rape

Crime News: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు షేక్‌ ముగ్దమ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిగూడ గ్రామానికి చెందిన మహిళ పని మీద జైనూర్‌కు వచ్చింది. ఆటోలో తన తల్లిగారిల్లు సోయంగూడకు వెళ్లే క్రమంలో రాఘవాపూర్ దాటిన తర్వాత ఆటో డ్రైవర్ షేక్ ముగ్దం బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ కేకలు వేయడంతో కర్రతో దాడి చేశాడు. అప్పుడే ఆమె సృహతప్పి పడిపోయింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో ముగ్దమ్‌ ఆమెను రోడ్డుపైన వదిలేసి వెళ్లిపోయాడు. స్పృహలోకి వచ్చిన ఆమె అత్యాచార, హత్యాయత్నంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సదయ్య తెలిపారు. ముగ్దమ్‌పై అత్యాచారయత్నం, హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ సదయ్య వెల్లడించారు.

Read Also: Godavari: కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం.. మహారాష్ట్రకు రాకపోకలు బంద్

జైనూర్‌లో ఆదివాసి మహిళపై అత్యాచార యత్నం ఘటనపై కొమురం భీం చౌక్ వద్ద ఆదివాసీ సంఘాలు ధర్నా నిర్వహించాయి. మహిళపై అత్యాచార యత్నంతో పాటు చంపే ప్రయత్నం చేసిన వ్యక్తిని ఉరి తీయాలని ఆదివాసీ సంఘాలు నినాదాలు చేశాయి. రేపు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.