ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా.. సోమవారం నాడు జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 25 పరుగుల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఆకాశమే హద్దుగా సిక్స్ల వర్షం కురిపించి మరోసారి ఐపీఎల్ లో అత్యధిక స్కోరును తన పేరుపై ఉన్న రికార్డును మరింతగా మెరుగుపరుచుకుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరోచిత ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండి పోయాలా ఆడాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాది.. ఐపీఎల్ చరిత్రలోనే నాలుగవ వేగవంతమైన సెంచరీని అందుకున్నాడు. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న అతను 8 సిక్స్లు, 9 ఫోర్ల సహాయంతో 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Also read: WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. స్టేటస్ కోసం..
ఇకపోతే ఇలా ట్రావిస్ హెడ్ ఊచకోత వెనుక నిజానికి ఎనిమిదేళ్ల పగ దాగుందని చెప్పవచ్చు. అవును ఒకటి కాదు.. రెండు కాదు.. ఎనిమిది సంవత్సరాల క్రితం ట్రావిస్ హెడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడు. 2016 ఐపీఎల్ సీజన్లో భాగంగా హెడ్ ఆర్సిబి లో ఉన్నాడు. అయితే ఆర్సిబి టీం అతన్ని సరిగ్గా వాడుకోలేకపోయింది. ఓపనర్ గా ఆడించాల్సిన అతనిని ఏకంగా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపిస్తూ అవకాశాలు కూడా తక్కువగానే ఇచ్చేవారు. దాంతో అది నచ్చని హెడ్ ఆర్సిబి నుండి బయటికి వచ్చేసాడు.
Also read: CM Jagan Stone Attack : సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి అరెస్ట్
ఇకపోతే అప్పటి కసిని అంతా ఇప్పుడు వెళ్లదీశాడు. తనను పొమ్మన్న ఆర్సిబి టీమ్ కు చుక్కలు చూపుతూ.. విజయం ఆమదంతా దూరం చేశాడు. తన 8 ఏళ్ల పగను అతను ఈ విధంగా తీర్చుకున్నాడు. ఓ ప్లేయర్ కు సరైన అవకాశాలు వస్తేనే అతడిలో ఉన్న అసలైన ఆటగాడు బయటకి వస్తాడు. కాకపోతే., తక్కువ అవకాశాలు ఇచ్చి ఆడమంటే ఎలా చెప్పండి..? కాబాట్టి ఎప్పుడైనా సరే.. ఓ ఆటగాడిలో ఆట అదే సత్తా ఉందని తెలిస్తే.. అతడికి తగినన్ని అవకాశాలు ఇవ్వడం జరగాలి. లేకపోతే సదరు ఆటగాడు నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది.