Site icon NTV Telugu

Murder Mystery : బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ హత్య కేసు చేధించిన పోలీసులు..

Crime

Crime

Murder Mystery : హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు చివరికి ఈ కేసును చేధించారు. మే 23న ఓ యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన ఘోరమైన ఘటన వెనక నేపాల్‌కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Joan Alexander: 88 ఏళ్ల వయస్సులో డిగ్రీ పూర్తి చేసిన బామ్మ..!

పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన యువతి నేపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తూ జీవనం సాగించేది. అదే సెంటర్‌లో మరో వ్యక్తి విజయ్ కూడా పని చేస్తున్నాడు. ఇద్దరూ గత నెలలోనే నగరానికి వచ్చారు.

మే 23న జరిగిన హత్య అనంతరం విజయ్‌ మృతదేహాన్ని దాచేందుకు ట్రావెల్ బ్యాగ్‌ను కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ఓ షాపు నుంచి కొనుగోలు చేశాడు. అనంతరం ఆ బ్యాగ్‌లో మృతదేహాన్ని పెట్టి, బాచుపల్లి శివారులోని జీతేపీర్ దర్గా సమీపంలోని పొదల మధ్య వదిలిపెట్టాడు. బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించగా, చుట్టుపక్కల సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతను నేరం చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు.

ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం కారణంగా హత్య జరిగిందా..? లేక ఇంకా ఇతర కారణాలున్నాయా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్న పోలీసులు, అవసరమైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Ram Mohan Naidu: మీరు ఇలాగే చేస్తే.. రానున్న రోజుల్లో ఒకే సీటుకు పరిమితం అవుతారు..

Exit mobile version