NTV Telugu Site icon

Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ

Rto

Rto

Transport Deportment: సంక్రాంతి పండుగా సందర్భంగా రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ పై భారీగా దాడులు నిర్వహించింది. జనవరి 6 నుండి 18 వరకు, హైదరాబాద్ నగరవ్యాప్తంగా 317 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్టు బేస్డ్ బస్సులపై రవాణా శాఖ అధికారులు సీరియస్ చర్యలు తీసుకున్నారు. రవాణా శాఖ కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై భారీగా జరిపిన చలాన్లు వసూలు చేసింది. మొత్తం లక్షా 11 వేల చలాన్లు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Delhi Weather: ఢిల్లీని గజగజ వణికిస్తున్న చలి గాలులు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఇక ఈ దాడులకు సంబంధించి రవాణా శాఖ అందించిన వివరాల ప్రకారం.. సెంట్రల్ జోన్ లో 43 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒక్కో బస్సుకు లక్షా రెండు వేల చలాన్లు వసూలు చేసారు. అలాగే ఈస్ట్ జోన్ లో 50 బస్సులపై కేసులు నమోదు చేసి ఒక్కో బస్సుకు తొమ్మిది వేల చలాన్లను వసూలు చేసారు. ఇంకా వెస్ట్ జోన్ లో 30 బస్సులపై కేసులు నమోదు చేసి ఒక్కో బస్సుకు లక్షా రెండు వేల చలాన్లను విధించారు. మరోవైపు నార్త్ జోన్ లో 48 బస్సులపై కేసులు నమోదు చేయగా.. సౌత్ జోన్ లో 72 బస్సులపై కేసులు నమోదు చేసారు అధికారులు. అలాగే నాగోల్ DTT పరిధి అత్యధికంగా 74 బస్సులపై కేసులు నమోదు చేసి కొరడా ఝళిపించారు అధికారులు. ఈ చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణిస్తున్న ప్రజలకు భద్రత, నిబంధనలు పాటించేలా కట్టుబడి ఉంటాయనే లక్ష్యంతో చేపట్టారు. రవాణా శాఖ ఆఫీసర్లు, ఈ చర్యల ద్వారా అత్యధికంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే ట్రావెల్స్ పై కట్టుదిట్టమైన పర్యవేక్షణను కొనసాగించనున్నట్లు తెలిపారు.