NTV Telugu Site icon

Protest : ట్రాన్స్‌జెండర్లను అవహేళన… బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర నిరసన

Farmers Protest

Farmers Protest

Protest : హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ శ్రీశ్రీ విగ్రహం ముందు ట్రాన్స్‌జెండర్లు మరియు ట్రాఫిక్ అసిస్టెంట్లు కలిసి నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమను అవహేళన చేయడం అనైతికమని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “50 మంది ట్రాన్స్‌జెండర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాం” అని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేస్తుండగానే బీఆర్ఎస్‌కు చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ లు హేళనగా నవ్వడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ తీవ్రంగా స్పందించింది.

నిరసనలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇచ్చి, సమాజంలో మనుగడ కోసం సహాయం చేశారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనల్ని అవహేళనగా చూడటం బాధాకరం” అని అన్నారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాపై ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు మేము గౌరవప్రదమైన పని చేసుకుంటుంటే, దానిని కూడా అవహేళన చేస్తారా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు. “ఇది వ్యక్తిగతంగా మాకు మాత్రమే కాదు, మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజానికి అవమానం” అని వారు అన్నారు.

సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఈ వ్యవహారాన్ని ఖండించాలి. ట్రాన్స్‌జెండర్లను హేళన చేయడం కేవలం వారినే కాదు, సమాజంలో సమానత్వాన్ని కాంక్షించే వారందరినీ అవమానించడమే” అని సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Gaza: గాజాలో తీవ్రమైన నిరసనలు.. “హమాస్” తమ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆందోళన..