NTV Telugu Site icon

TS High Court: ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జిల బదిలీ

Tshigh Court

Tshigh Court

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. జస్టిస్ సుధీర్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయగా.. జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే, గత కొద్దీ రోజుల కిందట సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసిన విషయం తెలిసిందే.. ఇక, ఆ సిఫార్సులకు రాష్ట్రపతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కేంద్రమంత్రి మేఘ్వాల్ పేర్కొన్నారు. వీరితో పాటు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వివే క్‌కుమార్‌ సింగ్‌ను మద్రాస్‌కు, కలకత్తా హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ శేఖర్‌ బి.షరాఫ్‌ను అలహాబాద్‌కు, జస్టిస్‌ బిబేక్‌ చౌధురీని పట్నా హైకోర్టులకు ట్రాన్స్ ఫర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Keerthy Suresh: మహానటి ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం…

తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత, జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ బదిలీతో ఆ సంఖ్య 26కు చేరగా.. ఖాళీల సంఖ్య 16కు చేరుకుంది. అయితే, జస్టిస్‌ చిల్లకూరు సుమలత 2021 అక్టోబరు 15న తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమకం అయ్యారు. 2007లో తొలుత ఆమె జిల్లా జడ్జిగా ఉన్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జిగా, హైదరాబాద్‌ జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ న్యాయమూర్తిగా పని చేశారు.

Read Also: Kotha Manohar Reddy: బీఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఇక, జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌ కుమార్‌ స్వస్థలం కొత్తగూడెం.. కాగా, ఆయన 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. 1994 డిసెంబరు 21న న్యాయవాదిగా వృత్తి జీవితం స్టార్ట్ చేసిన ఆయన కేఎల్‌ యూనివర్సిటీ, విజ్ఞానజ్యోతి సొసైటీ నిర్వహించే విద్యా సంస్థలు, పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా పని చేశారు. హైకోర్టు, సిటీ సివిల్‌ కోర్టులు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించారు.

Show comments