Keerthy Suresh: మహానటి ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి సురేష్… 14 నవంబర్ 2013లో వచ్చిన మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి పదేళ్లు అవ్వడంతో #10YearsOfKeerthySuresh అనే ట్యాగ్ ని కీర్తి సురేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ఫోటోలని, ఆమె యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాల గురించి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అందరిలాంటి మాములు హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ కెరీర్ ని టర్న్ చేసిన సినిమా మహానటి. ఈ సినిమా కీర్తిపై ప్రేక్షకుల్లో అంచనాలని పెంచింది అందుకే మహానటి తర్వాత కీర్తి సురేష్ నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ అంచనాలని అందుకోవడంలో కీర్తి సురేష్ ఫెయిల్ అయ్యింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సామీ స్క్వేర్, పందెం కోడి 2 ,అన్నాతే… ఇలా ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అవ్వడంతో కీర్తి సురేష్ కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో మహానటి సినిమానే లాస్ట్ ఇక కీర్తి సురేష్ కెరీర్ అయిపోయినట్లే, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో పడిపోయి కెరీర్ నాశనం చేసుకుంది అనే కామెంట్స్ ఎక్కువ వినిపించాయి.
ఇలాంటి సమయంలో కీర్తి సురేష్… లావు తగ్గి స్లిమ్ అయ్యి కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించింది. గ్లామర్ కి పెట్టుకున్న గీతలని కూడా కాస్త బ్లర్ చేస్తూ కీర్తి సురేష్ మేకోవర్ చూపించింది. సర్కారు వారి పాట సినిమాతో కీర్తి కొత్తగా కనిపించి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి దూరంగా వచ్చి హీరోల సినిమాలు చేయడానికి రెడీ అవ్వడంతో కీర్తి సురేష్ మళ్లీ బిజీ అయ్యింది. కమర్షియల్ సినిమాల్లో కూడా తన పాత్రకి తగ్గ గుర్తింపు ఉన్న వాటినే చేస్తూ కెరీర్ ని మళ్లీ స్ట్రాంగ్ గా చేసుకుంటుంది కీర్తి సురేష్. దసరా సినిమాలో వెన్నల పాత్ర అలాంటిదే. నాని మాస్ సినిమాకి కీర్తి సురేష్ ప్రాణం పోసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ హోంబలే బ్యానర్ లో ‘రఘు తాత’ సినిమా చేస్తోంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లోకి కూడా డెబ్యూ ఇస్తోంది. ఈ సినిమాలు సాలిడ్ హిట్స్ గా నిలిస్తే కీర్తి సురేష్ పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడం గ్యారెంటి.
Also Read
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!