Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency Landing: మహారాష్ట్రలో ఓ శిక్షణా విమానం అత్యవసర పరిస్థితుల్లో చెరుకు పొలంలో ల్యాండ్ కావడం కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాంకేతిక లోపంతో నేటి ఉదయం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో శిక్షణలో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. గ్రామానికి ఉత్తర దిశలో సుమారు 1.5 కి.మీ. దూరంలో ఉండగా విమానం ఇంజిన్ పవర్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
అయితే పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న ట్రైనీ పైలట్ సమీపంలోని చెరుకు పొలంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. భూమిపై ఉన్న ప్రజలకు ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. అయితే అత్యవసర ల్యాండింగ్ కారణంగా ట్రైనీ పైలట్ తీవ్ర షాక్‌కు గురైనట్లు సమాచారం.
Also Read
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
విమానం పొలంలో దిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సాంకేతిక లోపానికి అసలు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే గోజుబావి గ్రామంలో ఇంతకుముందు కూడా విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ అత్యవసర ల్యాండింగ్ ఘటనపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఇంజిన్ ఫెయిల్యూర్ కారణాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్‌కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!