Site icon NTV Telugu

Maharashtra Death Mystery: సెల్ఫీ వీడియోతో డెత్ మిస్టరీ ఛేదింపు.. ఎలా అంటే..!

Selfi

Selfi

కొన్ని కేసులు పోలీసులకు సవాలుగా మారుతుంటాయి. ఆధారాలు లభించక ఏళ్ల తరబడి దర్యాప్తులు కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని కేసులైతే చిన్న చిన్న క్లూల ద్వారా ఛేదిస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ డెత్ మిస్టరీని సెల్ఫీ వీడియోతో చాకచక్యంగా పట్టేసుకున్నారు.

రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫోన్‌ను చోరీ చేసేందుకు దుండగుడు యత్నించాడు. అదే సమయంలో మరో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో అతడు అడ్డంగా బుక్కై అరెస్ట్ అయ్యాడు. అనంతరం దొంగ దగ్గర దొరికిన ఇంకో ఫోన్‌ ఆధారంగా ఓ మర్డర్‌ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Chandrababu: వింజమూరు ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

జాహిద్‌ జైదీ అనే వ్యక్తి రైలులో సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా.. ఓ వ్యక్తి అతడి ఫోన్‌ను దొంగిలించే యత్నం చేశాడు. వెంటనే ప్రయాణికుడు అప్రమత్తమై.. పారిపోతున్న దొంగను వీడియోలో రికార్డు చేశాడు. దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి దొంగను పట్టుకోవాలని పోలీసులను కోరాడు. వీడియో వైరలవ్వడంతో స్పందించిన కల్యాణ్ రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. ఇటీవల ట్రైన్ యాక్సిడెంట్‌లో చనిపోయిన కేసు బయటపడింది.

ఇది కూడా చదవండి: KKR vs RCB: కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు.. రాణించిన విరాట్ కోహ్లీ

నిందితుడు జాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. అతడి దగ్గర ఉన్న ఉన్న ఫోన్ ఆన్ చేయగా.. అది పుణెకు చెందిన ప్రభాష్ భాంగేదిగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్ ఉద్యోగి అయిన ప్రభాష్.. హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్‌లోని తన నివాసానికి వచ్చాడు. తిరిగి మార్చి 25 అర్ధరాత్రి పుణెకు వెళ్తుండగా విఠల్‌వాడి రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి చనిపోయాడు. అతని ఫోన్ జాదవ్‌ దగ్గరే ఉంది. మొబైల్‌ను తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించే క్రమంలో భాంగే కదులుతున్న రైల్లో నుంచి కింద పడి మరణించినట్లుగా జాదవ్ పోలీసులకు వివరించాడు.

ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

Exit mobile version