Boat Crash: నదిలో బోటు బోల్తా.. ఘటన సమయంలో బోటులో 16 మంది..
- గురువారం అర్థరాత్రి పడవ బోల్తా.
- బీహార్ లోని సరన్ జిల్లా సోన్‌పూర్‌లో ఘటన.
- ఆ సమయంలో పడవలో 16 మంది ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Crash: బీహార్ లోని సరన్ జిల్లా సోన్‌పూర్‌లో గురువారం అర్థరాత్రి పడవ బోల్తా పడటంతో నలుగురు గల్లంతయ్యారు. హైటెన్షన్ లైన్ తగిలి ఇద్దరు వ్యక్తులు కాలిపోయారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బోటులోని ఓ ప్రయాణికుడు మొండిగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటులోని చాలా మంది వ్యక్తులు సోన్‌పూర్ నుండి పనులు ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పడవలో 16 మంది ఉన్నారు. ఇక పహెల్జా పుర్వారీ తోలాకు చెందిన వ్యక్తి కూడా పడవలో ఉన్నట్లు చెబుతున్నారు. దారిలో తనని దింపమని బోటు నడిపే వ్యక్తిని అడిగాడు.
Stock Market : సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
Also Read
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
పడవలో ఉన్న ఒక వ్యక్తి తనని ఆ కుగ్రామంలో దింపమని కోరడంతో పడవ ముందుకు కదిలి ఆ కుగ్రామానికి చేరుకుంది. నావికుడు అక్కడ నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగను చూశాడు. బోట్ నడిపే వ్యక్తి కరెంట్ భయంతో ఆ దిశగా తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. అయితే ఆ ప్రయాణికుడు అక్కడి వెళ్ళాలిసిందే అని పట్టుబట్టడం మొదలుపెట్టాడు. వరద ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అందుకే హైటెన్షన్ లైన్‌లో కరెంట్ లేదని చెప్పారు. ఈ నమ్మకంతోనే ఆ బోటు నడిపే వ్యక్తి పడవను ముందుకు కదిలించాడు. ఆ తర్వాత ఆమె హైటెన్షన్ వైర్ దగ్గరకు చేరుకోగానే బోటులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగాడు. అయితే ఒక్కసారిగా విద్యుదాఘాతం సంభవించడంతో పడవలో గందరగోళం నెలకొంది. అందరూ ఒకవైపుకు వెళ్లడంతో పడవ ఒకవైపుకి ఒరిగిపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వైరు తగిలి కాలిపోయిన భూషణ్ ప్రసాద్ రాయ్, కామేశ్వర్ రాయ్ ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరో నలుగురు గల్లంతయ్యారు. వారి అన్వేషణ కొనసాగుతోంది.
Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులంపై ఏకంగా 660 పెరిగింది! మరోసారి రికార్డు ధర
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!